శ్రీతేజ్ వ్యవహారంపై స్పందించిన దిల్ రాజు
HYD: సంధ్య థియేటర్ శ్రీ తేజ్ వ్యవహారంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ తేజ్ పేరిట అల్లు అర్జున్ రూ. 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపైన వచ్చే వడ్డీ కూడా వారికి వచ్చేలా చేయడం జరిగిందన్నారు. శ్రీ తేజ్ హాస్పిటల్ ఖర్చులు దాదాపు రూ. 70 లక్షలకు పైగా అల్లు అర్జున్ పే చేశారని, రిహాబిలిటేషన్ కోసం అయ్యే ఖర్చు కూడా భరిస్తామని చెప్పారన్నారు.