వానరం చేసిన పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
PDPL: సుల్తానాబాద్‌లో వానరాలు జనాన్ని తీవ్రంగా గాయపరుస్తున్న తరుణంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన అనుమాల బుచ్చయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద కూర్చుని ఉండగా, ఒక్కసారిగా ఓ వానరం వచ్చి అతని ఎక్కి కూర్చుంది. భయంతో బుచ్చయ్య తల్లడిల్లగా, ఆశ్చర్యంగా ఆ కోతి మాత్రం ఎలాంటి హానీ చేయకుండా నిశ్శబ్దంగా ఉండింది. కొద్దిసేపటికి వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.