స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశలో ఉండాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశలో ఉండాలి: కలెక్టర్

బాపట్ల జిల్లా ప్రగతి సూచికలను అభివృద్ధి దిశలో నిలిపేలా చూడాలని కలెక్టర్ డాక్టర్. వినోద్ కుమార్ గురువారం చెప్పారు. ఇంజినీరింగ్ శాఖలకు ప్రభుత్వం ర్యాంకులను అభివృద్ధి ఆధారంగా ఇవ్వాలని, నాలుగు గ్రేడ్‌లలోనూ పురోగతి కనిపించాలన్నారు. అన్ని కార్యక్రమాల్లో లక్ష్యాలను పూర్తి చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, సమగ్రతతో ఫలితాలను సాధించాలన్నారు.