UPDATE: జిల్లాలో తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు

UPDATE: జిల్లాలో తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు

సత్యసాయి: ధర్మవరం రైల్వే డివిజన్ పరిధిలో మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా రైల్వే అధికారులు ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు. అక్టోబర్ 28న మచిలీపట్నం-హిందూపురం రైలు, అక్టోబర్ 29న హిందూపురం-మచిలీపట్నం, ధర్మవరం-నరసాపురం, లింగంపల్లి-నరసాపురం, లింగంపల్లి-కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.