కార్మికుల స్థితిగతులపై సీఐటీయూ సర్వే
NLG: సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం కనగల్ మండలం కురంపల్లిలోని ఒక పార్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీలో కార్మికుల సర్వే నిర్వహించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, నాయకులు బురుకుల నరసింహ కార్మికుల వేతనాలు, సౌకర్యాలపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కాడింగ్ బిక్షం, సూరజ్ పటేల్, మహిళా కార్మికులు అంజమ్మ, విమలమ్మ, హమాలీలు పాల్గొన్నారు.