VIDEO: జమ్మలమడుగులో పెద్దమ్మ దేవర మహోత్సవం
KDP: జమ్మలమడుగు పెద్దమ్మ దేవర మహోత్సవంలో భాగంగా పెద్దమ్మ, గంగమ్మ, పోలేరమ్మ దేవస్థానాల వద్ద చల్ల పోసే బాణాలను కమిటీ సభ్యులు సోమవారం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు చల్ల పోయడం ప్రారంభించారు. సోమవారం నుంచి బుధవారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ 3 రోజులు సాయంత్రం ప్రసాద వితరణ ఉంటుందన్నారు.