సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన సర్పంచ్

సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన సర్పంచ్

WGL: రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ క్రీడలను ఇవాళ సర్పంచ్ రాయిని వెంకన్న ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహాన్ని పెంచుతుందని తెలిపారు. గెలుపు-ఓటమిని సమానంగా స్వీకరించే క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణతో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా గ్రామానికి గౌరవం తెచ్చుకోవాలని యువతకు సూచించారు.