VIDEO: కలెక్టర్‌పై శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

VIDEO: కలెక్టర్‌పై శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

కాకినాడలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ కలెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ సినిమాలు చూసి పరీక్షలు పాస్ అయ్యారని, అసలు ఐఏఎస్ చదవలేదని ఎద్దేవా చేశారు. యు. కొత్తపల్లి పాఠశాలలో జరిగిన వివక్ష ఘటనపై తానే స్వయంగా హైకోర్టు ద్వారా కేసు నమోదు చేయించానని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.