రీ సర్వేకు రైతులు సహకరించాలి: కలెక్టర్

MLG: వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో భూముల రిసర్వేకు రైతులు సహకరించాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. మంగళవారం గ్రామంలో నిర్వహిస్తున్న భూ సరిహద్దుల సమగ్ర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ వేణు, సర్వేయర్లు రాజు, వీరస్వామి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.