పెనమలూరులో విషాదం

కృష్ణా: పెనమలూరు (M) యనమలకుదురుకి చెందిన పునీత్ వర్మ ప్రేమించి, పెద్దలు అంగీకరించకపోయినా కొన్ని నెలల కిందట యువతిని వివాహం చేసుకున్నాడు. భార్యతో వచ్చిన మనస్పర్ధలతో సోమవారం రాత్రి తాడిగడప వంతెనపై నుంచి కాలువలోకి దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, NDRF సిబ్బంది గాలింపు చేపట్టగా మంగళవారం మృతదేహం లభ్యమయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.