VIDEO: నిర్దోషులైతే ఎందుకు రోడ్లెక్కారు? ఎమ్మెల్యే
WGL: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు రావడంతో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన రాస్తారోకోలు, నిరసనలు వారి భయాందోళనలను బయటపెడుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం పట్టణంలో వారు మాట్లాడుతూ.. నిర్దోషులైతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన ఆయన, తప్పు చేయనివారు రోడ్లెక్కి డ్రామాలు చేయరన్నారు.