కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత

ముదక్: వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ నిమ్మ రంగారెడ్డి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు సుల్తాన్, భానుగౌడ్, కరుణాకర్, గుండు నర్సింహులుగౌడ్ పాల్గొన్నారు.