VIDEO: తుళ్లూరులో అడ్డదిడ్డంగా పార్కింగ్
GNTR: తుళ్లూరు పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్త పార్కింగ్ వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.