యూరియా కోసం తెల్లవారుజామునే రైతుల క్యూ
WGL: పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో యూరియా కోసం రైతులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచే రైతులు వరుసగా నిలబడి ఎరువు కోసం ఎదురుచూస్తున్నారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.