ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష విజయవంతం
గోవాలో ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష విజయవంతమైంది. సముద్ర నిఘా విమానం పీ-8ఐ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. విమానం నుంచి నాలుగుసార్లు విజయవంతంగా కంటైనర్‌ను అధికారులు విడుదల చేశారు. దీనిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. దీనికి సంబంధించిన పరీక్షలన్నీ పూర్తయ్యాయని, త్వరలోనే నేవీలో చేరనుందని రక్షణశాఖ తెలిపింది.