వర్షాలకు ఇంటి స్లాబ్ కూలి.. ఒకరికి గాయాలు

VSP: జోరుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం సాయంత్రం ఇంటి స్లాబ్ కూలి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. 34 వార్డు అల్లిపురం కొబ్బరి తోట సమీపంలో గల కాలనీలో నివాసం ఉంటున్న సింహాచలం ఇంటి స్లాబ్ కూలిపోవడంతో స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లోని వస్తువులు, విలువైన ఫర్నిచర్ ధ్వంసం అయింది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.