అమరావతికి వెళ్లే వారికి ఆహారం ఇదే.!

కృష్ణా: అమరావతి పునఃప్రారంభోత్సవానికి తరలివచ్చే ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందు కోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బస్సులో 120 ఆహార పొట్లాలు, 100 అరటి పండ్లు, 120 నీటి సీసాలు, 60 ORS, 60 మజ్జిగ ప్యాకెట్‌లతో పాటు కిచిడి, చట్నీ ఒక ఆరెంజ్ అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేస్తోంది.