చైన్ లాక్కొని యువకుడు పరార్

చైన్ లాక్కొని యువకుడు పరార్

HYD: మధురానగర్ PS పరిధిలో ఓ యువకుడు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. రహమత్ నగర్‌లో నివాసం ఉండే మంగళం శంకరమ్మ ఆదివారం ఉన్న కల్లు దుకాణంలో కల్లు తాగింది. అనంతరం జానకమ్మతోట వద్ద వెళ్తుండగా ఓ యువకుడు ఆమెను ఆపి అరిస్తే రాళ్లతో కొడతానని బెదిరించాడు. మెడలో దాదాపు మూడున్నర తులాలు బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.