బాలల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

GNTR: బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గురువారం తాత్కాలిక గుర్తింపు కార్డులు అందజేశారు. బాలల సంక్షేమం, వీధి బాలల సంక్షేమ శాఖ గుంటూరు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం చేపట్టింది. బాలల సంక్షేమంపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ సౌందర్య, తదితరులు పాల్గొన్నారు.