ఇరాన్‌ నావికుల మృతదేహాలను అప్పగింత

ఇరాన్‌ నావికుల మృతదేహాలను అప్పగింత

శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా జలాంతర్గామి దాడిలో 84 మంది ఇరాన్ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా 45 మంది మృతదేహాలను శ్రీలంక ప్రభుత్వం ఆ దేశ రాయబార కార్యాలయానికి అప్పగించింది. గాలే ఆసుపత్రిలో భద్రపరిచిన ఈ మృతదేహాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇరాన్‌కు తరలించనున్నారు.