'మేరా యువ భారత్' ఆధ్వర్యంలో తెలంగాణ వికసిత్
RR: 'మేరా యువ భారత్' ఆధ్వర్యంలో తెలంగాణలో వికసిత్ భారత్ యువ పార్లమెంట్ సందడి మొదలైంది. మార్చి 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని MCRHRDలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయని రంగారెడ్డి జిల్లా యువజన అధికారి ఐశయ్య తెలిపారు. 33 జిల్లాల విజేతలు ఇందులో పాల్గొంటారని.. ఇక్కడ ప్రతిభ చాటిన వారు ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.