ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

KMM: ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన పద్దం కన్నారావు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంటివద్దే ఉంటున్నాడు. సోమవారం మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య అనసూర్య పొలం పనులు చూసుకోవాలన్నారు. దీంతో మనస్తాపానికి గురైన కన్నారావు గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.