మంచినీటి సరఫరా వేళల మార్పు

W.G: కార్తీక మాసం మంగళవారంతో ముగియడంతో పట్టణంలో మంచినీటి సరఫరా వేళలను మార్చినట్టు మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణవేణి తెలిపారు. నిడదవోలు పట్టణంలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సరఫరా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. పట్టణ ప్రజలు గమనించాలని కోరారు.