బస్టాండ్‌లో తనిఖీలు.. పలువురికి జరిమానా

బస్టాండ్‌లో తనిఖీలు.. పలువురికి జరిమానా

KMM: ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఖమ్మం RTC బస్టాండ్‌లో డీపో మేనేజర్ శివప్రసాద్ ఇవాళ తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న దుకాణాలను పరిశీలించారు. MRP ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నట్లు దుకాణాదారులకు జరిమానాలు విధించారు. ప్రయాణికులను దోచుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మకాలు చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.