VIDEO: పుట్టపర్తిలో ఘనంగా హోంగార్డుల దినోత్సవం

VIDEO: పుట్టపర్తిలో ఘనంగా హోంగార్డుల దినోత్సవం

సత్యసాయి: పుట్టపర్తిలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 63వ హోంగార్డ్స్‌ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని 347 మంది హోంగార్డులు పరేడ్‌ మైదానం చేరుకొని ఎస్పీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పరిశీలన వాహనంలో ఎస్పీ హోంగార్డుల పరేడ్‌ను పరిశీలించారు.