గోకవరం మండలంలో పోలీస్ నిఘా: ఎస్సై

గోకవరం మండలంలో పోలీస్ నిఘా: ఎస్సై

తూ.గో: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఏజెన్సీ ముఖ ద్వారమైన గోకవరం మండలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లూరు జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో మండలంలో గట్టి భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఎస్సై పవన్ కుమార్ గురువారం తెలిపారు. మండలంలో అపరిచిత వ్యక్తులు అనుమానంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.