బెజ్జంకిలో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు
SDPT: బెజ్జంకి మండలంలో శనివారం అసెంబ్లీ ముట్టడి (చలో హైదరాబాద్)పిలుపు నేపథ్యంలో, పోలీసులు ఆశావర్కర్లను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా,గ్రామాల్లోనే అడ్డుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.