వైభవంగా కంఠ మహేశ్వరుని యంత్ర పూజలు
WGL: నెక్కొండ మండల కేంద్రంలో గౌడ కుల ఆరాధ్య దైవం కంఠ మహేశ్వరుని యంత్ర పూజ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యంత్ర ప్రతిష్ఠ అనంతరం శాస్త్రోక్తంగా హోమాలు, మంగళహారతులు సమర్పించి దేవుని ఆశీస్సులు కోరారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.