హైస్కూల్లో ముందస్తు 77వ రిపబ్లిక్ వేడుకలు
W.G: తణుకు మండలం తేతలి హైస్కూల్ విద్యార్థులు, టీచర్లు 77వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికారు. హెచ్ఎం KSVV ప్రసాద్ ఆధ్వర్యంలో జీవశాస్త్ర టీచర్ BM గోపాలరెడ్డి సారధ్యంలో దేశభక్తి నినాదాలు చేస్తూ ఆనాటి జాతీయ నాయకులకు నివాళులర్పించారు. దేశ సమైక్యతకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. సుధారాణి, గంగాభవాని, మారుతి రామ్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.