మే 19న ఎస్టీ గురుకుల COE ప్రవేశ పరీక్ష

మే 19న ఎస్టీ గురుకుల COE ప్రవేశ పరీక్ష

NRPT: ఎస్టీ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ విద్యార్థులు మే 19న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtwreis.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.