సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

KMR: గాంధారి మండలంలోని నేరాల్ గ్రామంలో సీఎం, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ చిత్రపటాలకు బుధవారం మహిళలు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ రాథోడ్ దేవి, ఉప సర్పంచ్ చిన్న సాయిలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయూబ్, అబ్బు, ఐకెపి సిబ్బంది విమల ఉన్నారు.