సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో ఎమ్మెల్సీ

కృష్ణా: మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా కృష్ణా - గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన అలపాటి రాజేంద్రప్రసాద్‌ను వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ అర్చక స్వాములు సతీష్ శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.