చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
MDCL: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో జరిగింది. ఇబ్రహీంపట్నానికి చెందిన కళ్యాణ్ (36) ఇటీవల ఉప్పల్ నుంచి మేడిపల్లికి వెళ్తుండగా పీర్జాదిగూడ కామన్ వద్ద వెనుక నుంచి RTC బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.