'గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి'

MBNR: ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులు జడ్చర్ల నియోజకవర్గం ప్రజలపై ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం జడ్చర్ల పట్టణంలోని 23వ వార్డులో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.