వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన!
వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న భద్రాది కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం కొత్తపల్లికి చెందిన రేసు వీరస్వామి (75) మృతి చెందారు. అధిక రక్తపోటుతో కుప్పకూలిన ఆయనను ఎంజీఎంకు తరలించారు. ఈసీజీ తీయించడానికి వెళ్లినప్పుడు వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదని, నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.