'సిబిల్ స్కోర్‌కు సంబంధం లేకుండా యువ వికాసం అమలు చేయాలి'

SRD: సిబిల్ స్కోర్‌కు సంబంధం లేకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సిబిల్ స్కోర్ ఎవరికోసం అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.