'విద్యాభివృద్ధికి మౌలానా సేవలు చిరస్మరణీయం'
KRNL: భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించారని మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్ కొనియాడారు. మంగళవారం భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.