ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: దమ్మపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాధాన్యం అని అన్నారు. సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ అందజేస్తున్నట్లు తెలిపారు.