బురదమయంగా మారిన రోడ్డు

బురదమయంగా మారిన రోడ్డు

SRCL: చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమవుతున్నాయి. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి లింగంపేట గ్రామం నుంచి సనుగుల వెళ్లే రహదారి బురద మయంగా మారింది. గ్రామంలోని పలు వీధులులో దారి చిత్తడిగా మారాయని గ్రామస్తులు పేర్కొన్నారు. రోడ్డుపై ఇటీవల ఎర్రమట్టి పోయడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.