మండపేటలో రాజకీయ పార్టీలతో తహసీల్దార్ సమావేశం
కోనసీమ: సహాయ ఓటరు నమోదు అధికారి తహసీల్దార్ పి. తేజేశ్వరరావు అధ్యక్షతన మండపేట తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. ఎన్నికల దరఖాస్తు ఫారాలు-6, 7, 8 ల ప్రస్తుత స్టేటస్‌ను వివరించారు. రివిజన్లో భాగంగా చేపడుతున్న ఓటర్ల, ప్రోగెనీ మ్యాపింగ్ వివరాలను పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.