రాయదుర్గం అభివృద్ధికి రూ.10కోట్లతో పనులు: ఎమ్మెల్యే

రాయదుర్గం అభివృద్ధికి రూ.10కోట్లతో పనులు: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణ అభివృద్ధికి రూ.10 కోట్లతో పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం పట్టణంలో రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమృత్-2 పథకం ద్వారా రూ.78 కోట్లతో 6,000 కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.