'ఈనెల 11 నుంచి శిక్షణ తరగతులు'
కాకినాడ: వాకిలపూడిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఈనెల 11 నుంచి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు. SSC, ఆపై తరగతుల్లో ఉత్తీర్ణులైన వారికి ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. మూడు నెలల శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం అందిస్తారని పేర్కొన్నారు.