ద్వారకా తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..?

ద్వారకా తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..?

ఏలూరు: ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో రూ 2.2 కోట్లు అధిక ఆదాయం లభించింది. ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.