మోడల్ స్కూల్‌లో వంట సిబ్బంది పోస్టులకు దరఖాస్తులు

మోడల్ స్కూల్‌లో వంట సిబ్బంది పోస్టులకు దరఖాస్తులు

JGL: మల్లాపూర్ మోడల్ పాఠశాల బాలికల వసతి గృహంలో ఖాళీగా ఉన్న హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచించారు. అర్హతల విషయానికి వస్తే, హెడ్ కుక్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత, అసిస్టెంట్ కుక్ పోస్టుకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత అవసరమని తెలిపారు.