INSPIRATION: రవ్వా శ్రీహరి
సామాన్య చేనేత కుటుంబం నుంచి ద్రావిడ వర్సిటీ వీసీగా ఎదిగిన రవ్వా శ్రీహరి ప్రయాణం ఆదర్శనీయం. సంస్కృతాంధ్ర భాషల్లో అఖండ పాండిత్యం గల ఆయన.. 'శ్రీహరి నిఘంటువు', 'అన్నమయ్య పదకోశం' వంటి నిఘంటు రచనలతో తెలుగు భాషకు ప్రాణం పోశారు. నిరంతర సాహిత్య కృషితో కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతగా నిలిచిన ఆయన నేటి యువ సాహితీవేత్తలకు స్ఫూర్తిదాత.