వెళ్లిన IT సంస్థలను తిరిగి తెస్తున్నాం: కొల్లు రవీంద్ర
AP: రాష్ట్రంలో సాంకేతికతను ప్రోత్సహించేందుకు 27 పాలసీలను తెచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు విజన్ వల్లే డేటా సెంటర్లు వస్తున్నాయని, గతంలో వెళ్లిన IT సంస్థలను తిరిగి తెస్తున్నామని చెప్పారు. అలాగే మత్స్యకారులను రెచ్చగొడుతూ YCP అభివృద్ధిని అడ్డుకుంటోందని, కుట్రలను ఛేదించి ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేస్తామన్నారు. మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.