రేపు సరస్వతి దేవాలయ వార్షికోత్సవం

రేపు సరస్వతి దేవాలయ వార్షికోత్సవం

SRD: సంగారెడ్డి పట్టణం డ్రైవర్స్ కాలనీలోని సరస్వతి దేవాలయ 20వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఉదయం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, 8 గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. రాత్రి 6 గంటలకు దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.