రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్రగాయాలు
KNR: కేశవపట్నంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంకరపట్నం గద్దపాకకి చెందిన సంపత్ భార్య మౌనికతో కలిసి చిగురు మామిడికి వెళ్లి తిరిగి వస్తుండగా.. కేశవపట్నంలో ఓ కుక్క అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది. దీంతో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.