రేపు టెక్స్ టైల్స్ పార్క్‌కు మంత్రి భూమిపూజ

రేపు టెక్స్ టైల్స్ పార్క్‌కు మంత్రి భూమిపూజ

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసిలో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి రేపు ఉదయం 10 గంటలకు భూమిపూజ జరగనుందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సోమవారం తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఇది కీలక అడుగుగా మారనుందన్నారు.