పగిలిపోయిన సిమెంట్ రోడ్లు

పగిలిపోయిన సిమెంట్ రోడ్లు

NLR: ఆత్మకూరులో గతంలో వేసిన పలు సిమెంట్ రోడ్లు చీలిపోయి వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. చెరువు కట్ట సమీపంలో విద్యుత్ కార్యాలయం వెనుకవైపు, ఫారెస్ట్ కార్యాలయం ఎదురుగా ఉన్న సిమెంట్ రోడ్లు పగిలి పోయి రెండుగా చీలిపోయి ప్రజలకు ఇబ్బందిగా ఏర్పడింది. రోడ్లు వేసే సమయంలో నాణ్యత లేకపోవడంతో రోడ్లు పగిలిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు.